TS Khammam Assembly Constituency: TS Election 2023: సెంటిమెంట్‌ పాటించిన సండ్ర! మరోసారి వ్యాపారవేత్త ఇంటి నుంచే..
Sakshi News home page

TS Election 2023: సెంటిమెంట్‌ పాటించిన సండ్ర! మరోసారి వ్యాపారవేత్త ఇంటి నుంచే..

Published Sat, Oct 21 2023 12:06 AM | Last Updated on Sat, Oct 21 2023 10:02 AM

- - Sakshi

సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే వెంకటవీరయ్య​

సాక్షి, ఖమ్మం: గత ఎన్నికల్లో మాదిరిగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈసారి కూడా తనకు కలిసొస్తున్న సెంటిమెంట్‌ను పాటించారు. ప్రతీ ఎన్నికల్లో మండలం నుంచైతే రామానగరంలో, పట్టణంలోనైతే హనుమాన్‌నగర్‌ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం నుంచి పూజలు చేసి, వ్యాపారవేత్త వందనపు సత్యనారాయణ ఇంటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఇప్పటికే రామానగరంలో ప్రచారం చేసిన సండ్ర... శుక్రవారం సత్తుపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పట్టణంలోని పలు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కళ్ల ముందే కనిసిస్తున్న నేపథ్యాన మరోమారు తనను గెలిపించాలని కోరారు.

మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్‌, నరుకుళ్ల మమత, వేములపల్లి పుష్పలత, దేవరపల్లి ప్రవీణ్‌, మేకల భవాని, మారుతి సూరిబాబు, వీరపనేని రాధిక, గుండ్ర రాఘవేందర్‌, ఎం.డీ.గఫార్‌ఖాన్‌, చల్లగుండ్ల కృష్ణయ్య, మల్లూరు అంకమరాజు, యోగానందం, అద్దాల మీరా, మాధురి మధు, వల్లభనేని పవన్‌ పాల్గొన్నారు.
చదవండి: పాలేరులోనే పొంగులేటి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement