మెనూ ప్రకారం భోజనం అందుతోందా?
తల్లాడ: జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఆశాలత బుధవారం తల్లాడ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతీ బుధశారం జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల్లో తనిఖీ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో ఆమె వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీపీఓ మెనూ ప్రకారం భోజనం అందుతోందా, పాఠాలు అర్థమవుతున్నాయా, అసౌకర్యాలు ఉన్నా యా అని తెలుసుకున్నారు. ఆతర్వాత మరుగుదొడ్ల ను పరిశీలించి నిర్వహణకు సూచనలు చేశారు. అనంతరం మల్లవరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీఓ పన్నుల వసూళ్లు, పారి శుద్ధ్య పనులపై ఆరాతీశారు. ఎంపీఓ కె.శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment