నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి

Published Fri, May 10 2024 4:45 PM

-

ఆసిఫాబాద్‌అర్బన్‌: అకాల వర్షాలు, ఈదురుగాలు లతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తూ వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు కృషి చేస్తున్నామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వాసుదేవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షం, ఈదురుగాలులతో జిల్లాలో 23 విద్యుత్‌ స్తంభాలు, ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు వివరించారు. కెరమెరి, కౌటా ల, తదితర ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టి, విద్యుత్‌ పునరుద్ధరించామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వేగంగా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆసిఫాబాద్‌ సర్కిల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ సంబంధిత సమస్యలపై 79016 28370 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement