కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి

Published Fri, May 10 2024 4:45 PM

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి

కెరమెరి(ఆసిఫాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ముండె యశోదా గృహంలో గురువారం ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారన్నారు. ప్రజలు ఓటు వేసి సుగుణను ఆశీర్వాదించాలని కోరారు. ఇద్దరం కలిసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. సుస్థిర పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పేదల పార్టీ కాదని, పెద్దల పార్టీ అని విమర్శించారు. పదేళ్లలో దేశాన్ని దోచుకుందని ఆ రోపించారు. యశోదా మంత్రికి స్వీటు తినిపించి శాలువాతో సత్కరించారు.

జైనూర్‌(ఆసిఫాబాద్‌): బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో గురువారం రోడ్‌షోతోపాటు సమావేశం నిర్వహించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించాలన్నారు. గత ప్రభుత్వం ఆత్రం సుగుణపై 50పైగా కేసులు నమోదు చేసిందని పేర్కొన్నారు.

కౌటాల/కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ మండలం కోసిని శివారులో ఉపాధిహామీ కూలీలతో గురువారం మంత్రి సీతక్క మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని, రూ.400 వరకు కూలి పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రశ్నించే గొంతుక పే దింటి బిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలన్నారు. మహిళల కు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేతికి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్‌చార్జీలు శ్యాంనాయక్‌, రావి శ్రీనివాస్‌, నాయకులు గణేశ్‌ రాథోడ్‌, రజాక్‌, సుదర్శన్‌, సాజిద్‌ దేశ్‌ముఖ్‌, సాగర్‌, జలపతిరావు, సుజాయత్‌ ఖాన్‌, సమద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి మంత్రి సీతక్క

Advertisement
 
Advertisement