కాంగ్రెస్‌లోకి ఆత్మారాంనాయక్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ఆత్మారాంనాయక్‌

Published Fri, May 10 2024 4:45 PM

కాంగ్రెస్‌లోకి ఆత్మారాంనాయక్‌

రెబ్బెన(ఆసిఫాబాద్‌): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రెండు పర్యాయాలు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా ఆత్మారాంనాయక్‌ హస్తం గూటికి చేరారు. గురువారం కమలం పార్టీని వీడి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనుల అభ్యున్నతికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితుడై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. అత్మారాంనాయక్‌తో పాటు సేవాలాల్‌ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్‌, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహబూబ్‌ అలీ, సేవాలాల్‌ సేన జిల్లా నాయకులు జర్పుల తిరుపతి, నాయకులు మోహన్‌ తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement