పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసఫాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కాటన్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెటింగ్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024 – 25 సీజన్‌లో జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, సుమారు 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521గా నిర్ణయించిందని, జిల్లాలోని 17 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు జిన్నింగ్ మిల్లులను సందర్శించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల్లో పత్తి నిల్వ పేరుకుపోకుండా చూడాలని సూచించారు. రహదారులను ఆనుకుని మిల్లులు ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలో పత్తి పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉండగా.. నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి అహ్మద్, పత్తి కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment