ఒక్కొక్కరిని పిలిచి.. ఆరా తీసి
● వాంకిడి ఆశ్రమ పాఠశాలలో అదనపు కలెక్టర్ విచారణ
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలో ని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిను ల అస్వస్థతకు కారణాలు గుర్తించేందుకు ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. సోమవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు ఆధ్వర్యంలో వివరాలు సేకరించగా.. మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తి వారి సమక్షంలో విచారణ కొనసాగింది. అటెండ ర్లు, వంట సిబ్బంది, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులను ఒక్కొక్కరిని పిలిచి వివరాలు నమోదు చేసుకున్నా రు. అస్వస్థతకు గురైన 64 మంది విద్యార్థినుల్లో 63 మంది కోలుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుతు న్న శైలజ మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికి త్స పొందిన అనంతరం ఆర్‌ఎంపీ వద్ద కూడా చికి త్స తీసుకున్నట్లు తెలియడంతో ల్యాబ్ టెక్నీషియ న్, మెడికల్ నిర్వాహకుడిని విచారించారు. సుమా రు రెండుగంటలపాటు పాఠశాలలో విచారణ జరి పిన అనంతరం అధికారులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ రికార్డులు పరిశీలించారు. బాలికలు ఆ స్పత్రిలో ఎప్పుడు చేరారు.. ఎన్ని రోజులు చికిత్స పొందారు.. అనే కోణంలో విచారించినట్లు డీఎంహెచ్‌వో సీతారాం తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల్లో ఆహార పదార్థాలు కూడా కలుషితం కాలేదని అధి కారులు చెబుతుండగా.. అస్వస్థతకు కారణాలపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీటీడీవో రమాదేవి, తహసీల్దార్ రియాజ్ అలీ, మండల ప్రత్యేకాధికారి రాథోడ్ బిక్కు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ విషమంగా శైలజ ఆరోగ్యం
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న శైలజ ఆరోగ్య పరిస్థి తి మళ్లీ విషమంగా మారింది. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గత వారం హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. డయాలసిస్ అనంతరం కొంత కోలుకోగా మంగళవారం మళ్లీ విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నా రు. కాగా ఆశ్రమ పాఠశాల వద్ద సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హెచ్‌ఎం, సిబ్బందిపై బదిలీ వేటు
ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థత గురైన ఘటనపై బాధ్యులను చేస్తూ హెచ్‌ఎం శ్రీనివాస్ సహా మరో నలుగురు సిబ్బందిని బదిలీ చేస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారని డీటీడీవో రమాదేవి తెలిపారు. కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ నివేదిక మేరకు హెచ్‌ఎం శ్రీనివాస్‌ను కాగజ్‌నగర్‌కు బదిలీ చేయగా.. ఏఎన్‌ఎం సెవంత, కుక్ హరికిషన్, వర్కర్ కమలను బంబార ఆశ్రమ పాఠశాలకు, మరో వర్కర్ పెంటయ్యను పెంచికల్‌పేట్ మండలం కమ్మర్‌గాంకు బదిలీ చేసినట్లు డీటీడీవో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment