నేను 1262 విత్తనం రకం నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. గత సీజన్లో 1262 రకం ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఈ సారి మాత్రం ధాన్యం నూకవుతోంది.. సన్నం వల్లే సమస్య అంటూ మిల్లర్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆర్‌ఎస్‌కేలో వివరాలు చెప్పినా.. మిల్లర్ నుంచి వాహనాలు, సంచులు పంపకపోవడంతో ధాన్యం బస్తాలు సిద్ధం చేసి, రోడ్ల మీదే ఉంచాను. – టి. చంద్రశేఖర్, కోలవెన్ను
1262 రకం నూక, ముక్క అవుతుందని మిల్లర్లు తీసుకోవటానికి వెనుకాడుతున్నట్లు సమాచారం అందింది. అయితే అన్నిరకాల ధాన్యం సేకరించాల్సిందేనని మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం. గ్రామాలకు వెళ్లి సేకరణ ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నాం.
– డి.సృజన,
మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ
అన్ని రకాలూ కొనాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment