No Headline
లబ్బీపేట(విజయవాడతూర్పు): నెలల నిండకుండా పుట్టిన చిన్నారులకు (ప్రీ మెచ్యూర్ బేబీస్) అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలోని నోరి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రీ మెచ్యూరిటీ డే నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా నోరి హాస్పిటల్ వైద్యులు నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు వైద్యం అందించడంలో విజయవంతం అవుతుండటం అభినందనీయమన్నారు. అనంతరం డాక్టర్ నోరి సూర్యనారాయణ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందుబాటులో ఉండటంతో 450 గ్రాముల నుంచి 700 గ్రాముల బరువుతో పుట్టిన చాలా మంది శిశువులకు అత్యాధునిక వైద్యం విజయవంతంగా అందించినట్లు తెలిపారు. నియోనాటాలజిస్ట్స్ డాక్టర్ నరేంద్రబాబు, డాక్టర్ సుభాష్, అరుణ్, అతిథి, ఆస్పత్రిలో నెలలు నిండకుండా పుట్టి, రికవరీ అయిన పలువురు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు.
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్
డాక్టర్ వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment