పేదలకు ఉచితంగావైద్య సేవలు అందించాలి
కర్నూలు(సెంట్రల్): పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బి.కబర్ది అన్నారు. జిల్లాన్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో న్యాయాధికారులు, న్యాయ శాఖ సిబ్బందికి కర్నూలు న్యాయ సేవా సదన్‌లో శనివారం ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశా రు. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ క్యాంపును ప్రారంభించారు. కంటి, బీపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్యాంపులో వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యధికారులు, అశ్విని హాస్పిటల్, మెడికవర్ వైద్యులు చేపట్టారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అడిషినల్ జడ్జీలు పాండురంగారెడ్డి, భూపాల్‌రెడ్డి, శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, జిల్లా మెడికల్‌అండ్ హెల్త్ ఆఫీసర్ శాంతికళ పాల్గొన్నారు.
‘ఏటీఎం’ సాగుతోఏడాదంతా సిరులే
వెల్దుర్తి: ఏటీఎం మోడల్ వ్యవసాయంతో సంవత్సరంలో అన్ని రోజులు ఆదాయం పొందవచ్చని రైతు ఆనంద్ తెలిపారు. వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగైన ఏటీఎం పంటలను శనివారం ఫ్రాన్స్ దేశ నివాసి రేణుక, గుంటూరులోని ఈవీఎస్ రాష్ట్ర కార్యాలయం జనరల్ మేనేజర్ మన్మోహన్ పరిశీలించారు. ఏటీఎం పద్ధతిలో సాగు చేస్తన్న 32 రకాల పంటలపై ఆరా తీశారు. వీరి వెంట ఎన్‌ఎఫ్‌ఏ అబ్దుల్ బాసిత్, ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్‌లు జనార్దన్, మునిరాజు, ఐసీఆర్‌పీలు రవి, అయ్యస్వామి, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మధు, రామచంద్రుడు ఉన్నారు.
కలెక్టర్‌కు బెస్టు ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు ప్రదానం
కర్నూలు(సెంట్రల్): కలెక్టర్ పి.రంజిత్‌బాషా బెస్టు ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా అందుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డును అందుకున్నారు. బాపట్ల కలెక్టర్‌గా ఉన్న సమ యంలో 2024 ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణలో చూపిన ప్రతిభకు ఆయన ఈ అవార్డుకు ఎంపికై న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment