వీఆర్ పంచముఖికి పద్మశ్రీ
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయంలోని గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి వాదీరాజ్ పంచముఖి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆయన పద్మశ్రీ అందుకోనున్నారు. వీఆర్ పంచముఖి కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో మధ్వబ్రాహ్మణ వంశంలోని రాఘవేంద్రాచార్య, కమలాబాయి దంపతులకు జన్మించారు. గణితం, ఎకనామిక్స్‌లో మంచి పట్టున్న వీఆర్ పంచముఖి 1956లో కర్ణాటక విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకు, 1958లో బాంబే యూనివర్సిటీలో మొదటి ర్యాంకు సాధించారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అసమాన ప్రతిభ చాటుతూ అడుగులు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. 2003లో సంస్కృతం భారత రాష్ట్రపతి సర్టిఫికెట్ హానర్, 2008లో వాచస్పతిగా న్యూఢిల్లీ లాల్ బహదూర్ శాస్త్రి విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అలాగే విశ్వేశ్వరయ్య ప్రశస్థి, కర్ణాటక రాజోత్సవ అవార్డు 2013లో జీఐటీఎఎం పౌండేషన్ వార్షిక అవార్డు పొందారు. అంతకు మించి వివిధ ప్రొఫెసర్‌గా ఆయన సాధించిన ఘనత ఎంతో గొప్పది. భారతదేశం ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారుగా పనిచేయడం విశేషం. ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ జర్నల్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. వీఆర్ పంచముఖి పద్మశ్రీగా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల మంత్రాలయం వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
డాక్టర్ నాగేశ్వరరెడ్డి
కేఎంసీ పూర్వ విద్యార్థి
కర్నూలు (హాస్పిటల్): పద్మవిభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి కర్నూలు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆయన 1974వ బ్యాచ్‌లో ఇక్కడ ఎంబీబీఎస్ చదివారు. ఆయన తండ్రి డాక్టర్ భాస్కర్‌రెడ్డి కర్నూలు మెడి కల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ ద్వారా విశిష్ట వైద్య సేవలు అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించడం పట్ల కేఎంసీ ప్రిన్సి పాల్ చిట్టి నరసమ్మ, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ట్ హెచ్‌ఓడీ డాక్టర్ మోహన్‌రెడ్డి, సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్‌శర్మ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment