ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటుతోనే సాధ్యం
కర్నూలు(సెంట్రల్): దేశ భవిష్యత్ కోసం యువతీయువకులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. జేసీ నవ్య, ఇన్‌చార్జ్ డీఆర్వో బీకే వెంకటేశ్వర్లు, ఎస్‌డీసీ చిరంజీవి, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ గీతాలను విద్యార్థినులు ఆలపించారు. వేడుకలకు హాజరైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ వీడియో సందేశాన్ని వినిపించి న జేసి నవ్య ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థిని, విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే సీనియర్ సిటిజన్‌లు, విభిన్న ప్రతిభావంతు ఓటర్లకు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, ఉపాధి కల్పన అధికారి దీప్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment