స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నిత్యం ప్రజ

Published Fri, Mar 28 2025 1:59 AM | Last Updated on Fri, Mar 28 2025 1:57 AM

ఎదురులేని ఫ్యాన్‌

నాలుగు స్థానాల్లోను

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం

జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా

ఎం. ఇలియాజ్‌ఖాన్‌

జెడ్పీ చైర్మన్‌తో పాటు 37 మంది

జెడ్పీటీసీ సభ్యులు హాజరు

వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీలుగా

దేశాయి లక్ష్మిదేవమ్మ,

రాచపాటి రామాంజినమ్మ

కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యునిగా

షేక్‌ చిన్న షాలు

తుగ్గలిలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న నూతన ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా పరిషత్‌, కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీ స్థానాలకు, జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా, ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. జెడ్పీ, కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యులతో పాటు తుగ్గలి, వెల్దుర్తి మండల పరిషత్తుల్లో వైఎస్సార్‌సీపీకి విశేషమైన బలం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు.

జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా

మదర్ఖాన్‌ ఇలియాజ్‌ ఖాన్‌

జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్‌ ఇలియాజ్‌ ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన అభ్యర్థిత్వాన్ని వెలుగోడు జెడ్పీటీసీ అమీరున్‌బీ ప్రతిపాదించగా, మహానంది జెడ్పీటీసీ కేవీఆఆర్‌ మహేశ్వరరెడ్డి బలపరిచారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డితో కలిపి 37 మంది జెడ్పీటీసీ సభ్యులు హాజరై ఇలాయాజ్‌ఖాన్‌కు మద్దతు ప్రకటించారు. ఇలియాజ్‌ఖాన్‌ నామినేషన్‌ను స్క్రూటినీ చేసిన అనంతరం వాలీడ్‌ నామినేషన్‌గా డిక్లేర్‌ చేసి జిల్లా కలెక్టర్‌ పీ రంజిత్‌బాషా ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించారు. జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా ఇలాయాజ్‌ఖాన్‌ను ప్రకటించి డిక్లరేషన్‌ ఫారం అందించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా తుగ్గలి, వెల్దుర్తి ఎంపీపీలు

తుగ్గలి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలుగా రాచపాటి రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన వారంతా రామాంజనమ్మ అభ్యర్థిత్వానికి మద్దతుగా చేతులెత్తి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌ ఆమెను ఎంపీపీగా డిక్లేర్‌ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. అలాగే వెల్దుర్తి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యారు. మిగిలిన 14 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎల్‌ నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారి, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ కే తులసీదేవి ఎంపీపీగా ఎన్నికై న లక్ష్మిదేవమ్మకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యునిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, సెట్కూరు సీఈఓ డా.కే వేణుగోపాల్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

ఐదు పంచాయతీల్లో

ఉప సర్పంచుల ఎన్నిక...

జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో సభ్యులు.. ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా లక్ష్మమ్మ, ఆలూరు మండలం మొలగవెళ్లి ఉప సర్పంచ్‌గా గరక షాకీరా, కర్నూలు మండలం సుంకేసుల ఉప సర్పంచ్‌గా వడ్డే నీలమ్మ, వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఉప సర్పంచ్‌గా ఎం రామాంజనేయులు, దేవనకొండ మండలం వెలమకూరు ఉప సర్పంచ్‌గా ఉప్పర సరస్వతిని ఎన్నుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 1
1/1

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement