
ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మ
పోస్టుమార్టం
నిర్వహించడమే మా పని
మార్చురీకి వచ్చిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమే ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల బాధ్యత. మార్చురి నిర్వహణ అంతా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ చూసుకోవాలి. అయినా వాక్ ఇన్ కూలర్ రిపేరికి చర్యలు తీసుకున్నాం. రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కె.చిట్టినరసమ్మ,
ప్రిన్సిపల్, కేఎంసీ, కర్నూలు
ఫోరెన్సిక్ మెడిసిన్ పరిధిలోనే మార్చురీ
మార్చురీ వ్యవహారమంతా కర్నూలు మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం పరిధిలోనే ఉంటుంది. నిర్వహణ బాధ్యత పూర్తిగా వారిదే. మాకు సంబంధం లేదు. బాడీ ఫ్రీజర్లు, వాక్ ఇన్ కూలర్లు పనిచేయించేందుకు ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌ఓడితో మాట్లాడి పరిష్కరిస్తా. – డాక్టర్ కె.వెంకటేశ్వర్లు,
సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు
జీజీహెచ్ మార్చురీలో
పనిచేయని ఫ్రీజర్లు
● రోజూ ఆరు నుంచి పది మృతదేహాలకు
పోస్టుమార్టం
● నెలలో ఐదు వరకు
అనాథ మృతదేహాలు
● ఫ్రీజర్‌లు లేకపోవడంతో
కుళ్లుతున్న శవాలు
● మార్చురీ చుట్టుపక్కల భరించలేని
దుర్గంధం
● ఎవరికీ పట్టని మార్చురీ నిర్వహణ
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్క జిల్లాల్లో ఎక్కడ ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకున్నా పోస్టుమార్టం కోసం కర్నూలు మార్చురీకే తీసుకొస్తారు. ప్రతిరోజూ ఆరు నుంచి 10 వరకు మృతదేహాలకు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఇందుకు ఆరు నుంచి 32 గంటల సమయం పడుతుంది. ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన పోలీసులు వచ్చి పంచనామా చేసి ఆ నివేదికను ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులకు ఇస్తే అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగిస్తారు. పోస్టుమార్టం నిర్వహించేంత వరకు మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాటిని బాడీ ఫ్రీజర్లలో భద్రపరుస్తారు. నెలకు నాలుగు నుంచి ఆరు అనాథ మృతదేహాలను వీటిలోనే ఉంచుతారు. మార్చురీలో ఒక వాక్ ఇన్ కూలర్ ఉంది. అందులో 10 నుంచి 15 మృతదేహాలను భద్రపరచవచ్చు. ఇది కాకుండా మూడు బాడీ ఫ్రీజర్లు ఉండగా.. 18 మృతదేహాలను ఉంచవచ్చు. కానీ ప్రస్తుతం ఇవన్నీ పనిచేయని పరిస్థితి. వాక్ ఇన్ కూలర్ ఏడాది కాలంగా పనిచేయడం లేదు. ఒక బాడీ ఫ్రీజర్ రెండు నెలలుగా, మరో బాడీ ఫ్రీజర్ 15 రోజులుగా, ఇంకో బాడీ ఫ్రీజర్ రెండు రోజులుగా పనిచేయడం లేదని తెలుస్తోంది.
శవాలు కుళ్లికంపుకొడుతున్నాయి
మార్చురీలో వాక్ ఇన్ కూలర్, బాడీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వాటిని మూలనపడేశారు. దీంతో మార్చురీకి వచ్చిన మృతదేహాలను సెప్టిక్ మార్చురీలో ఉంచుతున్నారు. దాదాపుగా మెడికో లీగల్ కేస్ మృతదేహాలన్నింటికీ 24 గంటల్లోపు పోస్టుమార్టం పూర్తవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి పోలీసులు రావాల్సి ఉన్న పరిస్థితిలో 36 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి.
అటువైపు వెళ్లాలంటే నరకం
చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం చేయించుకుని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు పంచనామా చేయడానికి వచ్చిన పోలీసులతో మార్చురీ నిత్యం కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మార్చురీ కుళ్లిన కంపు వాసన వస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ దుర్వాసన మరింత ఎక్కువ అవుతోంది. పోస్టుమార్టం ముగిసి మృతదేహాన్ని తీసుకెళ్లేంత వరకు ఈ నరకం తప్పడం లేదు.
అనాథ మృతదేహాలకు దిక్కేలేదు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు చుట్టుపక్క ప్రాంతాల నుంచి మార్చురీకి అనాథ మృతదేహాలు ప్రతి నెలా నాలుగు నుంచి ఆరు దాకా వస్తుంటాయి. నిబంధనల మేరకు వీటిని కుటుంబసభ్యుల కోసం మూడు రోజుల పాటు మార్చురీలో ఉంచి ఆ తర్వాత అనాథ మృతదేహాలుగా పరిగణించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ మేరకు గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఒక వ్యక్తి కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఒక్కో అనాథ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. అయితే ఒక్కో మృతదేహం తీసుకెళ్తే గిట్టుబాటు కావడం లేదని.. ఒకేసారి మూడు, నాలుగు అనాథ మృతదేహాలు తోడయ్యాక తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా వాటిని తీసుకెళ్లేందుకు నెలరోజుల సమయం పడుతోంది. అప్పటి వరకు మార్చురీలో శవాలు కుళ్లి కంపుకొడుతున్నాయి. కొన్నిసార్లు పురుగులు పట్టిపోతుండటం గమనార్హం.
ఎవ్వరికీ పట్టని మార్చురీ
మృతదేహాలు ప్రభుత్వాసుపత్రి నుంచి
వస్తాయి.
మార్చురీ సైతం ప్రభుత్వాసుపత్రి
ఆవరణలోనే ఉంది.
పోస్టుమార్టం నిర్వహించేది మాత్రం
కర్నూలు మెడికల్ కాలేజిలోని ఫోరెన్సిక్
మెడిసిన్ విభాగం వైద్యులు.
ఈ కారణంగా మార్చురీ నిర్వహణ ఎవరు
చేయాలన్నది కొన్ని దశాబ్దాలుగా
అంతుబట్టడం లేదు.
ఫలితంగా మార్చురిలో మృతదేహాలను
పోస్టుమార్టంకు సిద్ధం చేసేందుకు
అవసరమైన సహాయకుల పోస్టులు
మంజూరు కాని పరిస్థితి.
ప్రస్తుతం అనధికారికంగా ముగ్గురు
వ్యక్తులు సహాయకులుగా పనిచేస్తున్నారు.
వీరికి జీతాలను వైద్యులే
సమకూరుస్తున్నారు.

ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మ

ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మ

ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మ

ఎన్నో సమస్యలతో.. ప్రమాదాల బారిన.. దిక్కులేని స్థితిలో మ