జాగ్రత్తలతో నేరాల అదుపు
● అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య
నెహ్రూసెంటర్: ప్రజలు జాగ్రత్తలతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో షీటీం, భరోసా, సైబర్‌క్రైమ్‌పై శుక్రవారం వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు, అఘాయిత్యాలను అదుపు చేయడంలో విద్యార్థుల ప్రాత కీలకమన్నారు. సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌కు దూరంగా ఉండాలని, ఫేక్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ సీఐ దేవేందర్, డీసీఆర్‌బీ సీఐ సత్యనారాయణ, షీటీం ఎస్సై సునంద, సిబ్బంది, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా
నెహ్రూసెంటర్: వైద్యారోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిఽధిలో ఇటీవల జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. ఎంపికై న అభ్యర్థుల జాబితాను మహబూబాబాద్.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వాయిదా పడిన మిగిలిన పోస్టులను 1.3 రేషియోలో భర్తీ చేసేందుకు త్వరలోనే సమాచారం అందిస్తామని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment