అర్హులకు న్యాయం చేస్తాం..
కేసముద్రం: అర్హులకు సంక్షేమ పథకాలు అందజేసి, న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని గాంధీనగర్‌జీపీలో నిర్వహించిన నాలుగు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికి రేషన్‌కార్డులు, ఇళ్లు ఇచ్చిందిలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గ్రామసభలను పెట్టి, ప్రజల సమక్షంలో అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఒకటి రెండు చోట్ల చిన్నచిన్న సమస్యలు వస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. జాబితాల్లో పేర్లు రానివారు తిరిగి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలను అందించడానికి గ్రామసభలను నిర్వహిస్తే, కొందరు కిరాయి గుండాలను పెట్టి లొల్లి పెట్టిస్తున్నారన్నారు. పారదర్శకంగా పార్టీలకతీతంగా నిజమైన పేదవాళ్లు లబ్ధిపొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం గ్రామంలో రైతుభరోసా పథకం మంజూరు పత్రాలు 282 మందికి, ఇందిరమ్మ ఆత్మీయభరోసా 14 మంది, ఇందిరమ్మ ఇళ్లు 70 మంది, రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను 23 మందికి అందజేశారు. అనంతరం వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్‌లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఆర్‌డీఓ మధుసూదన్‌రావు, ఆర్డీఓ కృష్ణవేణి, కేసముద్రం మార్కెట్ చెర్మన్ గంట సంజీవరెడ్డి, తహసీల్దార్ దామోదర్, ఎంపీడీఓ క్రాంతి, ఏఓ వెంకన్న, సొసైటీ వైస్ చైర్మన్లు అంబటి మహేందర్‌రెడ్డి, అల్లం నాగేశ్వర్‌రావు, భూక్య రామచంద్రు, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇనుగుర్తి మండలం పాతతండాజీపీలో పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజరై మాట్లాడారు. జాబితాల్లో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. పలువురికి పథకాల మంజూరు పత్రాలు అందజేశారు.
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
గాంధీనగర్‌లో నాలుగు పథకాలు ప్రారంభం
హాజరైన ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Comments
Please login to add a commentAdd a comment