సంస్కృతీసంప్రదాయాలతో బోధన ఉండాలి
జనగామ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ మన సంస్కృతీసంప్రదాయాలు బోధించే విద్యా విధానం లేకపోవడం బాధాకరమని, ఇప్పటికై నా ఆ లోటును భర్తీ చేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని త్రిదండి చినజీయర్‌స్వామి కోరారు. పట్టణంలోని బాణాపు రం వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ప్రధాన అర్చకుడు, యాదాద్రి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి తండ్రి గోవిందాచార్య, గురువు త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి స్మృత్యర్థం నిర్వహించిన ఆచార్య వరివస్య కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా జీయర్‌స్వామి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక రంగంలో కృష్ణమాచారి సిద్ధాంతి చేస్తున్న సేవలను అభినందించారు. పెద్దలను స్మరించడంతో పాటు సహచరులను సత్కరించి వారిని ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు. అనంతరం శ్రీ వరహస్వామికి స్వర్ణ కిరీటదారణ చేసి, కాలవివేకం అనే పుస్తకాన్ని జీయర్‌స్వామి ఆవిష్కరించారు. కృష్ణమాచార్య సిద్ధాంతి మాట్లాడుతూ జీయర్‌స్వామి చేతుల మీదుగా వరా హస్వామికి స్వర్ణకిరీటం సమర్పణ చేయడం సంతోషకరమన్నారు. సోమవారం జీయర్‌స్వామికి ఘ నంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఆచార్యులు ఆకెళ్ల జయకృష్ణ, శ్రీనివాసాదిత్య, ఫణివరకుమార్, బట్టర్ సుందర ప్రహ్లాదచారి, తిరువెంగలా చారి, నరసింహరామ, గౌరీబట్ల సీతారామ సిద్ధాంతి, బ్రహ్మబట్ల శ్రీనాథ్, శ్రీనివాసాచార్య, గౌరిబట్ల సుబ్రహ్మణ్య శర్మ, ఓరుగంటి మనోహరాశర్మ, యో గేశ్వర, అమర వాది లక్ష్మణాచార్యులు, మరింగంటి రాఘవాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి
Comments
Please login to add a commentAdd a comment