ఇలాంటి వాటిని సమర్థించుకోవడం ఎంత వరకు సబబు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌..? | - | Sakshi
Sakshi News home page

ఇలాంటి వాటిని సమర్థించుకోవడం ఎంత వరకు సబబు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌..?

Published Wed, Nov 1 2023 1:44 AM | Last Updated on Wed, Nov 1 2023 8:59 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండింంంచాల్సింది పోయి హేళన చేసే మాటలు మాట్లాడడం పీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డికే దక్కిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. మంగళవారం స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మట్లాడుతూ దాడి ఖండించకుండా కోడి కత్తి మెండి కత్తి అని దుర్మర్గంగా మట్లాడడం ఆయన మానసిక స్థితిని తెలుపుతుందన్నారు.

ఇలాంటి వారికి పొరపాటున అధికారం ఇస్తే ఏమైతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడం, వాటిని సమర్థించుకోవడం ఎంత వరకు సబబని అన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా తమ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ సీఎం అవుతారని చెప్పారు. తమ పార్టీకి లక్షల మంది కార్యకర్తల బలగం ఉందని, మేము అనుకుంటే ఒక్క క్షణంలో ఇలాంటి వారికి గుణపాఠం చెప్పగలమని అన్నారు.

హింస ద్వారా భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు హర్షించరని అన్నారు. విద్వేష రాజకీయలు చేయడం కాదని, అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలన్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలను కాపాడిన గన్‌మెన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సిములు, గణేష్‌, శివరాజు, రామకృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement