మోదీ హయాంలోనే దేశాభివృద్ధి | Sakshi
Sakshi News home page

మోదీ హయాంలోనే దేశాభివృద్ధి

Published Sun, May 5 2024 1:30 AM

మోదీ

గద్వాల రూరల్‌: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి మురుగన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెరు మైదానంలో నిర్వహించిన విజయసంకల్ప బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ 400 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి, మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజల్లో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు.. నిరాధర ఆరోపణలు చేస్తూ, ఎన్నికల్లో లబ్ధి పొందేలా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలు, రైతులు, మహిళలు, యువతకు లబ్ధి చేకూరిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి భరత్‌ ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి:

డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో రూ. 2లక్షల రుణమాఫీ, రైతుబంధు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్‌ట్యాప్స్‌, రూ. 5లక్షల క్రెడిట్‌ కార్డు ఊసేలేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే ఆరు గ్యారంటీలు అమలుచేస్తామని మరోసారి మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాల కోసం మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌, తల్లొజీ ఆచారి, లోక్‌నాథ్‌రెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, పద్మావతి, కృష్ణవేణి, జయశ్రీ పాల్గొన్నారు.

రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదు

ఎన్నికల్లో లబ్ధి కోసమే నిరాధర ఆరోపణలు

కేంద్ర సమాచార శాఖ మంత్రి మురుగన్‌

మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
1/1

మోదీ హయాంలోనే దేశాభివృద్ధి

Advertisement
Advertisement