ప్రత్యర్థుల విమర్శలు అర్థరహితం.. | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల విమర్శలు అర్థరహితం..

Published Thu, May 9 2024 5:00 AM

-

పాలమూరు సమస్యలపై నేను లోక్‌సభలో నోరు విప్పలేదని ప్రత్యర్థులు విమర్శించడం అర్థరహితం. పార్లమెంట్‌ సమావేశాలకు 68 శాతం హాజరవడమే కాకుండా.. లోక్‌సభలో ఎక్కువ ప్రశ్నలు సంధించిన మూడో వ్యక్తిని నేనే. 356 ప్రశ్నలను లేవనెత్తా. స్వయంగా కేంద్రమంత్రులను కలిసి పాలమూరు సమస్యలను పరిష్కరించాలని విన్నవించా. వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌ గురించి పలుమార్లు లోక్‌సభలో ప్రస్తావించా. ప్రస్తుతం ఆ లైన్‌కు సర్వే జరుగుతోంది. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు డబ్లింగ్‌ పనులు పూర్తి చేయడంతోపాటు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర, గద్వాల, శ్రీరాంనగర్‌, కృష్ణా రైల్వే స్టేషన్ల సుందరీకరణ, అభివృద్ధి, వైఫై సౌకర్యాల కల్పన వెనుక నా కృషి ఉంది. పత్తి రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పాలమూరులో సీసీఐ రీజినల్‌ కార్యాలయం ఏర్పాటుపై పార్లమెంట్‌లో గళమెత్తి విజయం సాధించా. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించడంలో సఫలీకృతమయ్యా.

Advertisement
 
Advertisement
 
Advertisement