రైతు భరోసా నిధులు విడుదల | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా నిధులు విడుదల

Published Tue, Jan 28 2025 1:08 AM | Last Updated on Tue, Jan 28 2025 1:08 AM

రైతు భరోసా నిధులు విడుదల

రైతు భరోసా నిధులు విడుదల

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమచేయడం ప్రారంభించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం కోస్గి మండలం చంద్రవంచలో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 16 మండలాలు ఉండగా.. తొలివిడతగా మండలానికి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇందులో భాగంగా రాంచంద్రాపూర్‌ (అడ్డాకుల), భట్టుపల్లి (భూత్పూర్‌), దమగ్నాపూర్‌ (చిన్నచింతకుంట), మీదిగోనిపల్లి (దేవరకద్ర), తిర్మలాపూర్‌ (కౌకుంట్ల), మూసాపేట (మూసాపేట), అప్పాజిపల్లి (బాలానగర్‌), మల్లెబోయినపల్లి (జడ్చర్ల), దోనూర్‌ (మిడ్జిల్‌), దేపల్లి (నవాబుపేట), రంగారెడ్డిగూడ (రాజాపూర్‌), జానంపల్లి (గండేడ్‌), ఇబ్రహీంబాద్‌ (హన్వాడ), అయ్యవారిపల్లి (కోయిలకొండ), పోతన్‌పల్లి (మహబూబ్‌నగర్‌ రూరల్‌), చెప్పాయిపల్లి (మహమ్మదాబాద్‌) గ్రామాలకు చెందిన 14,575 మంది రైతుల ఖాతాల్లో రూ.17,27,39,419ను ప్రభుత్వం జమ చేసింది. అయితే సాయం అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మిగతా అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విడతల వారీగా ఓ ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి సాయం అందించడం వల్ల ఓ స్పష్టత ఉండేదని.. కానీ ప్రస్తుతం ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. కాగా జిల్లాలో 4,48,413 ఎకరాల భూమి విస్తీర్ణం ఉండగా.. 2,39,256 మంది పట్టదారులు ఉన్నారు.

తొలిరోజు 16 గ్రామాల రైతులకు అందిన సాయం

14,575 మంది ఖాతాల్లో రూ.17.27కోట్లు జమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement