శ్మశానవాటికలో ఉండేవాళ్లం.. | - | Sakshi
Sakshi News home page

శ్మశానవాటికలో ఉండేవాళ్లం..

Published Tue, Jan 28 2025 1:09 AM | Last Updated on Tue, Jan 28 2025 1:08 AM

శ్మశా

శ్మశానవాటికలో ఉండేవాళ్లం..

మావి ఎనిమిది కుటుంబాలు. ఉండటానికి ఇళ్లు లేకపోవడంతో అడవిలో గుడిసెలు వేసుకొని ఉండేవాళ్లం. ఏడాది తర్వాత ఇళ్లు కట్టిస్తామంటూ గుడిసెలు తొలగించడంతో శ్మశానవాటికకు మకాం మార్చాం. రెండేళ్ల కిందట ఇళ్ల నిర్మాణానికి ముగ్గువేసి పనులు ప్రారంభించి వదిలేశారు. నాలుగు నెలల కిందట పంచాయతీ కార్యదర్శి వచ్చి శ్మశానవాటికలో ఉండొద్దని.. ఖాళీ చేయాలని ఆదేశించడంతో చౌదర్‌పల్లిలో గుడిసె వేసుకొని ఉంటున్నాం. – చెంచు సాయిలు,

చౌదర్‌పల్లి (మహమ్మదాబాద్‌)

ఎన్నాళ్లీ కష్టాలు..

తంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు కూలిపోవడంతో అదే స్థానంలో తడకలతో గుడిసె వేసుకొని నివా సం ఉంటున్నాం. వర్షాకా లం వచ్చిందంటే తెల్లవార్లు జాగరణ చేయాల్సిందే. చలికాలంలో సైతం ఇబ్బందులు పడుతున్నాం. కొత్త ఇల్లు కట్టిస్తారంటే ఆశపడ్డాం.. కానీ నేటికీ నిర్మించి ఇవ్వలేదు. మా గోడు పట్టించుకునే వారు కరువయ్యారు.

– రామాంజమ్మ,

చౌదర్‌పల్లి (మహమ్మదాబాద్‌)

42 మందికి ప్రొసీడింగ్స్‌..

ప్రఽదానమంత్రి జన జాతీయ ఆదివాసీ పథ కం కింద జిల్లాకు 428 ఇళ్లు మంజూరయ్యాయి. ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని 16 గ్రామాల్లో వీటిని నిర్మించనున్నారు. ఎంపికై న వారికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేదా అనే వివరాలు పంపాలని ఈఈ హౌసింగ్‌ కోరారు. ఈ బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించడంతో సర్వేలు చేస్తున్నారు. నివేదిక అందగానే గృహనిర్మాణ శాఖకు పంపిస్తాం. జిల్లాలో ఇళ్లు లేని వారికి, శిథిలావస్థలో ఉన్న 75 ఇళ్లకు తాత్కాలికంగా టార్పాలిన్లు అందజేశాం. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల కింద చిన్నాయిపల్లిలో 42 మందికి ప్రోసీడింగ్స్‌ ఇస్తున్నాం.

– ఛత్రూనాయక్‌, డీటీడీఓ, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శ్మశానవాటికలో ఉండేవాళ్లం..  
1
1/2

శ్మశానవాటికలో ఉండేవాళ్లం..

శ్మశానవాటికలో ఉండేవాళ్లం..  
2
2/2

శ్మశానవాటికలో ఉండేవాళ్లం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement