ప్రజావాణికి 68 అర్జీలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి.. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ వారం మొత్తం వివిధ సమస్యలపై 65 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో వారికి తగు సూచనలు ఇవ్వాలని చెప్పారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ పథకాలపై మండలాల వారీగా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో మంజూరు పత్రాలు అందచేసిన లబ్ధిదారుల వివరాలు సమగ్ర నివేదిక సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయేందిర
Comments
Please login to add a commentAdd a comment