గగన్చంద్రకు అభినందన ర్యాలీ
బల్మూర్: పాండిచ్చేరిలో ఈనెల 20 నుంచి 25 వరకు నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో బల్మూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి జి.గగన్‌చంద్ర రూపొందించిన త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ బైస్కిల్ మూడో స్థానం పొంది జాతీయ స్థాయికి ఎంపికై ంది. దీంతో బుధవారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా ర్థులు మండల కేంద్రంలో గగన్‌చంద్రను ర్యాలీగా ఊరేగించి అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్ఎం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి గగన్‌చంద్ర ఇప్పటికే పలు విజ్ఞాన సదస్సుల్లో పాల్గొని తాను తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో ఉత్తమ బహుమతులు సాధించినట్లు తెలిపారు. గగన్‌చంద్ర చిన్న వయసులోనే తన మేధోశక్తితో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కరెంటు చార్జింగ్, సోలార్ ప్యానల్, పెట్రోల్‌తో నడిచే త్రీ ఇన్ వన్ బైస్కిల్‌ను తయారు చేసి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని కొనియాడారు. భవిష్యత్‌లో విద్యార్థి గగన్‌చంద్ర మరిన్ని ఉత్తమ ప్రయోగాలతో రాణించాలని ఆకాంక్షించారు. ఎస్ఐ రమాదేవి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ గగన్‌చంద్రను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు భాస్కర్, నాగరాణి, ఉపాధ్యాయులు రజాక్, శ్రీధర్‌రావు, అనురాధ, శ్రీను, సీతారాం, రమేష్, లక్ష్మణ్, హర్యానాయక్, మోతీబాయి, నిర్మల, నానకమ్మ, కమలాబాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గగన్ రూపొందించిన త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ బైస్కిల్ జాతీయ స్థాయికి ఎంపిక
బల్మూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment