నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు

Published Thu, Jan 30 2025 1:48 AM | Last Updated on Thu, Jan 30 2025 1:48 AM

నేటి

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు

ఆలయ రాజగోపురం

జడ్చర్ల టౌన్‌: కృతయుగంలో మత్స్యపురంగా.. త్రేతాయుగంలో దురితకోలాహాలంగా.. ద్వాపరయుగంలో మాయాపురంగా పిలువబడి కలియుగంలో గంగాపురంగా పిలుచుకుంటున్న లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు ఆలయం పడమర ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు రానున్నారు.

10వ శతాబ్దంలో ఆలయం నిర్మాణం

జడ్చర్ల మండలం గంగాపురంలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం నాటి శిల్పుల కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆనవాళ్లున్నాయి. కోణార్క్‌ సూర్యదేవాలయం, గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఒకే విధంగా నిర్మించారని ప్రతీతి. ఆలయం చతురస్రాకారంలో నిర్మితమై ఉండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఆలయప్రాంగణంలో నిర్మించిన కోనేరు పలు ప్రత్యేకతలను నిలుపుకుంది.

ఏర్పాట్లు పూర్తి

మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ నవీన్‌ పర్యవేక్షణలో జాతర కోసం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో పెయింటింగ్‌, శుద్ధి చేసే ప్రక్రియ, ప్రాకారాలు, కోనేరు ఇతరు నిర్మాణాలకు 40మందితో జాజు పూయించారు. ఆలయ ప్రాంగణం, వెనకాల భక్తులు వంటావార్పు చేసుకునేందుకు గానూ చదునుచేసి సిద్ధంగా ఉంచారు. కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు గానూ నీటిని నింపుతున్నారు.

ఫిబ్రవరి 6 వరకు కొనసాగనున్న గంగాపురం జాతర

ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ,

అధికారులు

బ్రహ్మోత్స్చవ వివరాలు..

గురువారం అలంకారాభిషేకంతో ప్రారంభం కానున్న ఉత్సవాలు. తొలిరోజున స్వామి, అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం, నూతన వస్త్రాల అలంకరణతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 31 శుక్రవారం విశ్వక్సేన పూజ, పుణ్యాహావాచనం, కంకణధారణం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, అగ్నిప్రతిష్ఠ, పల్లకీసేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న ధ్వజారోహణం, ప్రాణప్రతిష్ట, బలిహరణం, 2న ఆదివారం రాత్రికి ఎదుర్కోలు, స్వామి, అమ్మవార్ల కల్యాణం, సోమవారం మనోహరమైన శేష, హంసవాహన సేవలు, పుష్పరథం (చిన్నతేరు), మంగళవారం రథసప్తమి సందర్భంగా పెద్దతేరు (రథోత్సవం), బుధవారం శకటోత్సవం (బండ్లు తిప్పుట), గురువారం పూర్ణాహుతి, చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు 1
1/1

నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement