కురుమూర్తిలో గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అమ్మాపురం కురుమూర్తి స్వామి దర్శనానికి అమవాస్యను సందర్భంగా బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలొచ్చి క్యూలో ఉన్నారు. మెట్లపై దీపాలు వెలిగిస్తూ గోవింద నామస్మరణ చేశారు. మొట్టు మెట్టుకు కొబ్బరి కాయలు కొట్టి స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా స్వామికి సమర్పించారు. అనంతరం అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాల మండపం వద్ద భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
ఘనంగా గిరి ప్రదక్షణ
కురుమూర్తి స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షణ ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, విశ్వహింద్ పరిషత్, బీజేపీ నాయకులు స్వామి వారి రాజగోపురం వద్ద పూజలు నిర్వహించారు. రాజగోపురం ప్రధాన మెట్లనుంచి స్వామి వారి ప్రధాన ఆలయం పక్కన, కలశపూజ మండపం పక్క నుంచి మట్టి అమ్మాపురం గ్రామం మీదుగా ఐదు కిలోమీటర్లు స్వామి వారి ఆలయం వరకు ప్రదక్షణలు చేశారు.
తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment