నేడు సబ్‌ జూనియర్‌రగ్బీ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నేడు సబ్‌ జూనియర్‌రగ్బీ జట్ల ఎంపిక

Published Tue, Jan 28 2025 1:08 AM | Last Updated on Tue, Jan 28 2025 1:08 AM

నేడు

నేడు సబ్‌ జూనియర్‌రగ్బీ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు సబ్‌ జూనియర్‌ రగ్బీ జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాలలో వచ్చేనెల 1 నుంచి 3వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ రగ్బీ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో రావాలని కోరారు. మిగతా వివరాల కోసం 89191 93768 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

వేరుశనగ క్వింటాల్‌ రూ.6,229

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి 5981 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌ గరిష్టంగా రూ.6,229, కనిష్టంగా రూ.3,009 ధరలు కేటాయించారు. కందులకు గరిష్టంగా రూ. 6,802, కనిష్టంగా రూ.5,067, ఉలువలు రూ.3,059, రాగులు రూ.2,259, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,450, కనిష్టంగా రూ.2,122 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో సోనామసూరి ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,609, కనిష్టంగా రూ.2,569, కందుల గరిష్టంగా రూ.7,166, కనిష్టంగా రూ.6,800గా నమోదయ్యాయి.

పట్టణాల్లో పక్కాగా భూ రికార్డుల నిర్వహణ

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): కేంద్రపథకం నేషనల్‌ జియో స్పేషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హ్యాబిటేషన్స్‌ (నక్షా)పేరుతో ఏడాది పాటు పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రిసోర్సెస్‌ సెక్రెటరీ మనోజ్‌ సిన్హా తెలిపారు. ఈ నక్షా ప్రాజెక్ట్‌ ఉద్దేశాలు, లక్ష్యాల అమలుపై ఆయన వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని 152 మున్సిపల్‌ పట్టణ ప్రాంతాలలో భూ రికార్డుల నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్రం రూ.5వేల కోట్ల పెట్టుబడి ప్రోత్సాహకంగా ప్రకటించిందని పేర్కొన్నారు. పట్టణాల్లో భూ రికార్డుల ఆధునికీకరణకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఐసీ భాగస్వామ్యంతో చేపట్టనున్నారని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మోహన్‌రావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సహాయ సంచాలకులు కిషన్‌రావు పాల్గొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని పీయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన పీయూలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించి తర్వాత నోటిఫికేషన్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్రమబద్ధీకరణ ఆలస్యం అయితే అధ్యాపకులకు బేసిక్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌, ఉద్యోగ భద్రత వంటివి కల్పించాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని, పోస్టులు మంజూరు చేసి వేతనం ప్రభుత్వవమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్జున్‌కుమార్‌, కరుణాకర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌, ఈశ్వర్‌కుమార్‌, శ్రీనివాస్‌లు, సురేష్‌, రామ్మోహన్‌, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

‘30లోగా ఫీజు చెల్లించాలి’

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వివిధ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఈనెల 30లోగా చెల్లించాలని ఎన్టీఆర్‌ కళాశాల ఓపెన్‌ డిగ్రీ కోఆర్డినేటర్‌ కిషోర్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు సబ్‌ జూనియర్‌రగ్బీ జట్ల ఎంపిక 
1
1/1

నేడు సబ్‌ జూనియర్‌రగ్బీ జట్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement