బాధ్యతగా డ్రైవింగ్ చేయండి
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్లపై నిర్లక్ష్యంగా వాహ నాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించా లని కలెక్టర్ విజయేందిర అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో బుధవారం క్లాక్‌టవర్ నుంచి మెట్టుగడ్డ వరకు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని కలెక్టర్‌తో పాటు ఎస్పీ డి.జానకి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ క్లాక్ టవర్ నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ కూడలి, న్యూటౌన్, మెట్టుగడ్డ అక్కడి నుంచి వన్‌టౌన్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా క్లాక్‌టవర్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. వాహనదారులు బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలు, అధికార యంత్రాంగం కలిసి పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చునని తెలిపారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఇలాంటి బైక్ ర్యాలీలు యువతకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడంతో పాటు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నా రు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం, నిబంధనలు పాటించడం అనివార్యం అన్నారు. ప్రమాదాలను నివారించేందుకు, బాధ్యతయుతమైన రైడింగ్ అలవర్చుకోవాలన్నారు. సురక్షిత ప్రయాణం మన కుటుంబానికి, సమాజానికి మేలు కలిగిస్తోందన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదాల కట్టడిపై ఏర్పాటు చేసిన బ్రోచర్స్, కరపత్రాలను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏఎస్పీ రాములు, డీటీసీ కిషన్, ఆర్టీవో రఘుకుమార్, డీఎస్పీ సుదర్శన్, సీఐలు భగవంతురెడ్డి, అప్పయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించడంతోనే
ప్రమాదాలు: కలెక్టర్
జిల్లాకేంద్రంలో భారీ బైక్ ర్యాలీనిర్వహించిన పోలీస్‌శాఖ
Comments
Please login to add a commentAdd a comment