ఇప్పట్లో వస్తాయన్న నమ్మకం లేదు..
నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో మొక్కజొన్న, మరో ఎకరంలో వరి సాగుచేస్తున్నా. ఇప్పటికే నాట్లు వేసుకున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత వానాకాలం సీజన్లో కూడా ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తదన్న నమ్మకం కూడా కుదరడం లేదు. ప్రభుత్వం సకాలంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి.
– చిటమోని సుధాకర్, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం
మండలానికో గ్రామమేనా..
మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం. మా కుటుంబానికి నాలుగెకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాను. రైతు భరోసా వస్తుందనే నమ్మకంతోనే వడ్డీపై డబ్బులు తీసుకువచ్చా. ఇంతవరకు పెట్టుబడి సాయం అందలేదు. నాతో పాటు గ్రామంలో చాలామంది రైతు భరోసా రాకపోవడంతో సాగు కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకులలో అప్పులు చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో సీజన్ ప్రారంభానికి ముందే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో అందరికీ ఒకేసారి వస్తే బాగుంటుంది.
–దొబ్బలి మొగులయ్య, రామచంద్రాపూర్, మహబూబ్నగర్ రూరల్
కసరత్తుకొనసాగుతోంది
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా కింద ఇప్పటివరకు ప్రతి మండలంలో ఎంపికచేసిన గ్రామా ల్లోని రైతుల ఖాతాల్లో ప్రభుత్వ సాయం జమ అయింది. మిగతా గ్రామాల్లోనూ వ్యవసాయ యోగ్యమైన భూములపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే రైతులందరికీ సాయం అందుతుంది.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నాగర్కర్నూల్
●
Comments
Please login to add a commentAdd a comment