ధాన్యం లారీలు అన్‌లోడ్‌ చేసి పంపాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం లారీలు అన్‌లోడ్‌ చేసి పంపాలి

Published Sun, May 5 2024 3:30 AM

ధాన్య

మందమర్రిరూరల్‌: మండలంలోని అందుగలపేటలో ఉన్న వేంకటేశ్వర రైస్‌మిల్లును జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ శనివారం సందర్శించారు. మిల్లుకు వరిధాన్యం లోడుతో వచ్చిన లారీలను వెంటనే అన్‌లోడ్‌ చేయాలని సూచించారు. తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపించాలని మిల్లు నిర్వాహకులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రెబ్బెన(ఆసిఫాబాద్‌): రెబ్బెన మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన ఇగురపు భరత్‌ రాష్ట్ర స్థాయి అండర్‌–17 క్రికె ట్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ శివ తెలిపా రు. ఈ నెల 6 నుంచి 8 వరకు ఏపీలోని ఒంగోలులో నిర్వహించనున్న పోటీలకు భరత్‌ ఎంపికయ్యాడు. ఈ పోటీలకు ప్రముఖ సినీనటుడు సుమన్‌, టీం ఇండియా క్రికెటర్‌ అంబటి రా యుడు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపా రు. పేద కుటుంబంలో జన్మించిన భరత్‌ క్రికెట్‌లో అసాధారణ ప్రతిభ చూపుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందించారు.

ధాన్యం లారీలు అన్‌లోడ్‌ చేసి పంపాలి
1/1

ధాన్యం లారీలు అన్‌లోడ్‌ చేసి పంపాలి

Advertisement
Advertisement