పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

Published Mon, May 6 2024 6:35 AM

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌/చెన్నూర్‌రూరల్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బి.సంతోష్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో, కిష్టంపేట గ్రామంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంల వద్ద రెండు నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం కమిషనింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోటీలో 42 మంది ఉన్నందున అదనపు బ్యాలెట్‌ యూనిట్‌ అవసరమని తెలి పారు. ఈమేరకు ఈసీఐఎల్‌ కంపెనీ నుంచి 1,800 అదనపు బ్యాలెట్లు వచ్చాయన్నారు. ప్రథమ పరిశీ లన పూర్తిచేసి ర్యాండమైజేషన్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. వీటిని చెన్నూర్‌కు 575, బెల్లంపల్లికి 575, మంచిర్యాలకు 726 కేటాయించామని వివరించారు. అనంతరం ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని సందర్శించి పోస్టల్‌ బ్యాలెట్‌ తీరును పరిశీలించారు. ఈ నెల 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement