మాయమాటలు చెప్పి.. డబ్బు కాజేసి..
భైంసాటౌన్(ముధోల్): పింఛన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వృద్ధుడి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తి డబ్బు కాజేసిన ఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కుభీర్ మండలం మాలేగాంకు చెందిన గంగాధర్ భైంసాలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ.30వేల నగదు డ్రా చేశాడు. బయటకు రావడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి నీకు నెలకు రూ.28వేల పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. బస్టాండ్ ఎదురుగా గల ప్రభుత్వ ఏరియాస్పత్రి వరకు తీసుకెళ్లి అతని వద్ద నుంచి రూ.19వేలు తీసుకున్నాడు. సార్ దగ్గర సంతకం పెట్టుకుని వస్తానని అతన్ని బయటే ఉంచి లోనికి వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే పికెటింగ్లో ఉన్న పోలీసులకు తెలుపడంతో ఆస్పత్రి సీసీ కెమెరాలు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment