ఓసీపీలో సీఐటీయూ నిరసన
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిపై జరిగిన కార్యక్రమంలో యూనియన్ డివిజన్ కార్యదర్శి గట్టు మహేందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బొగ్గు బ్లాక్లను ప్రైవేటుపరం చేస్తోందని తెలిపారు. నూతన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మిక వర్గ పోరాటాన్ని నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాశిపేట రాజేశం, సంపత్, సమ్మన్న, నరేష్, శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment