సరదాగా వెళ్లి.. ప్రమాదం బారినపడి..
● ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ● తాతా, మనవడి దుర్మరణం ● మరో బాలునికి గాయాలు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): సంతోషంతో సరదాగా బంధువుల ఇంటికి వెళ్లిన తాత, మనవడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన జైనథ్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్నగర్కు చెందిన షేక్ అలీ (58), మనవళ్లు ఇజాన్ (04), షేక్ అర్హాన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదివారం జైనథ్ చేరుకున్నారు. షేక్ అలీ కూతురుతో పాటు సోదరి కూడా అక్కడే నివాసం ఉంటారు. జాతర సందర్భంగా చిన్నారులు ఇద్దరిని అక్కడికి తీసుకెళ్లి రాత్రి కూతురి ఇంట్లోనే బస చేశారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో జైనథ్ మండల కేంద్రం సమీపంలో ఆదిలాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్తున్న ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఘటనలో షేక్ అలీతో పాటు ఇజాన్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అర్హాన్‌కు గాయాలయ్యాయి. షేక్ అలీ టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇతని కుమారుడు షేక్ నసీర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కుమారుడితో పాటు తండ్రి మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నా యి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతున్న అర్హాన్
Comments
Please login to add a commentAdd a comment