మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో సిటీ పో లీస్ యాక్ట్ సోమవారం నుంచి అమలులో ఉంటుందని సీపీ ఎం. శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 27 న ఉదయం 6 గంటల నుంచి 31న ఉదయం 6 గంటల వరకు ఈ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హె చ్చరించారు. కార్యక్రమాలకు అనుమతి తీసుకో వాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలను, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment