దరఖాస్తులు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పరిష్కరిస్తాం

Published Tue, Jan 28 2025 12:10 AM | Last Updated on Tue, Jan 28 2025 12:10 AM

దరఖాస

దరఖాస్తులు పరిష్కరిస్తాం

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

పాతమంచిర్యాల: ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ డైరీ–2025ని చెన్నూర్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ డి.చంద్రకళతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

● జన్నారం మండలం కవ్వాల్‌కు చెందిన పెరోజభాను తన భర్త ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చిన నెల రోజులకే క్యాన్సర్‌తో చనిపోయాడని, జీవో 216ప్రకారం పరిహారం అందించి ఆదుకోవాలని కోరింది.

● మంచిర్యాలకు చెందిన నాగమణి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన నాగమణి, నాగరా జులు తమ తండ్రికి చెందిన భూమిని భీమారం మండల కేంద్రానికి చెందిన మాటేటి మల్లిక త మకు తెలియకుండా పట్టా చేసుకున్నారని ఫిర్యాదు చేశారు.

● వేమనపల్లికి చెందిన తోకల హన్మంతు రాజారం గ్రామ శివారులో తన భూమిని కొందరు దౌర్జన్యం ఆక్రమించుకోగా కోర్టు ద్వారా పొందానని, ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని అర్జీ సమర్పించాడు.

● తాండూరు మండలం కొత్తపల్లికి చెందిన హేమలత ప్రభుత్వ జీవో 59 ప్రకారం ఇల్లు, ప్రభుత్వ స్థలం పొందానని ఆ భూమికి పట్టా ఇప్పించాలని కోరింది.

● జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఎండి.ఆహ్మద్‌ తన గ్రామ శివారులోని భూమికి కొలతలు చేయించాలని కోరాడు.

పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి

కోటపల్లి: కోటపల్లి నుంచి పార్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రకు అనుమతి ఇప్పించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య కలెక్టర్‌కు విన తిపత్రం అందజేశారు. రోడ్డు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారుల వైఖరికి నిరసనగా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారని, శాంతియుతంగా చేపట్టే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దరఖాస్తులు పరిష్కరిస్తాం1
1/1

దరఖాస్తులు పరిష్కరిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement