నర్సాపూర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి నాయకులు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ
ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్
మెదక్: ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ ఆరోపించారు. బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన మాటలు ఉత్తమాటలుగా మిగిలాయన్నారు.
రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, మెదక్, నిజాంపేట ఎంపీపీలు జయరాంరెడ్డి, సిద్దిరాములు, మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చార్జీల పేరిట వసూలు: సునీతారెడ్డి
ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో ఆమె మా ట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దీకరించేందుకు చార్జీల వసూల పేరిట రూ. వేల కోట్లు ప్రజల నుంచి గుంజాలని ప్రభుత్వం యోచిస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, పార్టీ నాయకులు చంద్రాగౌడ్, శేఖర్, జితేందర్‌రెడ్డి, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment