రఘునందన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి | Sakshi
Sakshi News home page

రఘునందన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

Published Mon, Apr 8 2024 8:15 AM

రామాయంపేటలో ప్రచారం నిర్వహిస్తున్న
 బీజేపీ కార్యకర్తలు  - Sakshi

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ దేశానికి మళ్లీ ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించడం ఖాయమని, మనం పార్టీల కతీతంగా మోదీని సమర్ధించాలని అభ్యర్థించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశం కోసమని, దేశం బాగుండాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యకర్తలు ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో పార్టీ సీనియర్‌ నాయకుడు శంకర్‌గౌడ్‌, కొడపర్తి నరేందర్‌, లావణ్య, యాదగిరి, సతీశ్‌రావు, సావమి, గిరి, అనిల్‌ పాల్గొన్నారు.

బీజేపీ ఇంటింటి ప్రచారం

మనోహరాబాద్‌(తూప్రాన్‌): బీజేపీ మండల నాయకులు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం మండలంలోని కాళ్లకల్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి రఘునందన్‌రావుని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు నరేందర్‌చారి, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, గోపాల్‌, మల్లేశ్‌, కృష్ణ, సత్యం, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement