ప్రాథమిక స్థాయి నుంచే గుణాత్మక విద్య
● కార్యాచరణ రూపొందించండి ● డీఈవోకు కలెక్టర్ ఆదేశం
మెదక్ కలెక్టరేట్: రానున్న విద్యా సంవత్సరంలో మొదటి రెండు తరగతుల నుంచే ప్రాథమిక స్థాయి గుణాత్మక విద్య అందించే దిశగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ డీఈఓ రాధాకిషన్‌ను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ప్రాథమిక స్థాయి విద్యాబోధన పురోగతిపై సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యులు వివరాలు అందజేసినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే విద్యా సంవత్సరంలో మొదటి ద్వితీయ తరగతి నుంచి ప్రాథమిక స్థాయి గుణాత్మక విద్య అందించే దిశగా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ రాధా కిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యులు ఈశ్వర్, నిషేత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రి ఆకస్మిక తనిఖీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ పేషెంట్ల రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, రక్త పరీక్ష రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి డాక్టర్లు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీలు అయ్యాయని మెడికల్ ఆఫీసర్ సాయి సింధును ప్రశ్నించగా రెండు చేసినట్లుగా చెప్పారు. డెలివరీల సంఖ్యను పెంచాలని సూచించారు. వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఏకాగ్రతతో చదవండి
కష్టపడి చదివితేనే మెరుగైన ఫలితాలు సాధించగలరని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మోడల్‌స్కూల్‌లో ఎడ్యుకేషన్ ఫెస్టివల్‌లో భాగంగా విద్యార్థులు రూపొందించిన పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు నెల రోజులు చదువుపై ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉత్తీర్థత పొందగలరని అన్నారు. సబ్జెక్టుపై పట్టుసాదించిన విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా తేలికగా అధిగమించగలరని చెప్పారు. కార్యక్రమంలో మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ వాణికుమారి, అధ్యాపకులు లింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment