యువత ఎక్కడికి పోవాలి
ఉద్యోగి సర్వీస్ పెంచితే
మెదక్‌జోన్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగి సర్వీస్ 57 నుంచి 60 సంవత్సరాలకు పెంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం 65 సంవత్సరాల వరకు పొడిగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అదే జరిగితే యువత ఎక్కడి పోవాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలరోజుల్లో తనకు రావాల్సిన బెన్‌ఫిట్స్‌ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉద్యోగులంతా ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డులను ఇవ్వటంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయ్యాక ఏడాది వరకు కూడా తనకు రావాల్సిన బెన్‌ఫిట్స్ రావటంలేదని ఓ ఉద్యోగి సోషల్‌మీడియా ద్వారా తన బాధను వెలిబుచ్చుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయాల్లో మేధావివర్గం మౌనం వహిస్తే దేశానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మెదక్‌ను రాజన్నసిరిసిల్ల జోన్ కొనసాగిస్తే ఉద్యోగ అవకాశాలు పోతాయని, చార్మినార్‌జోన్‌లో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు ఎంపీని కోరారు. జోనల్ మార్పు కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్న
మేధావి వర్గం ఆలోచించాలి
టీఎన్‌జీవో క్యాలెండర్, డైరీఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment