ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య
నర్సాపూర్‌రూరల్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబుద్ధులు నేర్పిస్తామని నర్సా పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం బుధవారం ఆయా జూనియర్ కళాశాలలల్లో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా జరిగే ప్రవేశ ప్రక్రియలో తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్, అధ్యాపకులు సురేష్ కుమార్, డాక్టర్ సమీరా, డాక్టర్ అనిత, శ్రీనివాస్, హేమంత్, మహేందర్ రెడ్డి, రాజు, రాములు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శైలజ, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment