కార్యదర్శుల పనితీరు కీలకం
మెదక్ కలెక్టరేట్: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు కీలకమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో కార్యదర్శుల పనితీరు హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పారదర్శక సేవలు అందించాలన్నారు. అనంతరం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ (ఏఐసీ) ఉద్యోగుల క్రీడా పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులను కలెక్టర్ సన్మానించారు. వచ్చే నెల మొదటివారంలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో జిల్లా తరఫున 20 పాల్గొననున్నారు. క్యారమ్స్‌లో తూప్రాన్ ఎంపీఓ సతీష్, 400 మీటర్ల పరుగు పందెంలో కొల్చారం ఏఈఓ రాజశేఖర్‌గౌడ్, హాకీలో శ్వేతా కుమారి, శారద, విద్యాశాఖ పీడీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
మెదక్‌జోన్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో దివ్వాంగులకు ఉచిత బ్యాటరీ ట్రై సైకిళ్ల ఎంపిక, కృత్తిమ అవయవాల కొలతల శిబిరాన్ని ప్రారంభించారు. పరికరాల పంపిణీకి ప్రతిపాదన సిద్ధం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మానసిక లోపం ఉన్న దివ్యాంగులను గుర్తించి అందుకనుగుణంగా చికిత్స అందిస్తామన్నారు. దివ్యాంగులకు పరికరాలు అందించేందుకు ముందుకొచ్చిన అలీమ్ కో స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హైమావతి, డీఆర్డీఓ శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రసన్నకుమార్, రాజబాబు, సురేంద్ర, గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ సురేందర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment