ఏడుపాయల్లో వెలగని వీధి దీపాలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో బుధవారం రాత్రి వీధి దీపాలు వెలగక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాఘ స్నానాల కోసం సుమారు లక్ష మంది భక్తులు వచ్చారు. అందుకనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇవ్వాలి. ఆలయ అధికారులు ఏడుపాయల్లోని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలి. కానీ హరిత హోటల్‌కు వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగక అమావాస్య చీకట్లు అలుముకున్నాయి.
దాడులు చేస్తే
ప్రతి దాడులు తప్పవు
నర్సాపూర్: తమపై దాడులు చేస్తే ప్రతి దా డులు తప్పవని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు శేఖర్, రామాగౌడ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. తమపై దాడులు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం సరికాదన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మారం, నర్సాపూర్‌లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించిన డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు విప్పడం లేదన్నారు. హామీల పేరిట మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను రాబోయే రోజుల్లో ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని చెప్పారు.
నేడు ప్రభుత్వ
వైఫల్యాలపై నిరసన
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరాస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
క్రీడలతో మానసికోల్లాసం
తూప్రాన్: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల లోపు బాల, బాలికల రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు బుధవారం ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. ఆయా జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment