ప్రమాదాలు తగ్గుముఖం
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రభులత
జహీరాబాద్‌టౌన్: డ్రైవర్లు భద్రత నియమాలు పాటించడం వల్ల ఈ ఏడాది ఆర్టీసీలో ప్రమాదాలు తగ్గాయని మెదక్ రీజినల్ మేనేజర్ ప్రభులత పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసో త్సవాల్లో భాగంగా జహీరాబాద్ డిపోలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదాలకు కారణమన్నారు. ప్రమాదరహిత డ్రైవర్లుగా ఎంపికై న శంకరయ్య,వినోదయ్య, పీఎన్ రెడ్డితోపాటు పలువురు ప్రైవేట్ డ్రైవర్లను ఈ సందర్భంగా ఆమె సన్మానించారు. కార్యక్రమంలో బుధేరా గురుకుల కళాశాల ప్రిన్సిపల్ మాధవి, వైస్ ప్రిన్సిపల్ స్రవంతి, డీఎం.జాకీర్ హుసేన్,అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సూపర్‌వైజర్ తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుకు రూ.5.37 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే
నర్సాపూర్: నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతు కోసం రూ. 5.37కోట్లు మంజూరయ్యానని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఎస్‌ఎన్‌టీ రోడ్డు నుంచి రుస్తుంపేట, మూసాపేట, నాగులపల్లి మీదుగా సికింద్లాపూర్ వరకున్న 9 కిలోమీటర్ల 53 మీటర్ల రోడ్డును తారు రోడ్డు చేస్తారన్నారు. పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆమె చెప్పారు.
అంగన్‌వాడీ భవనాల పరిశీలన
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండలంలోని అంగన్‌వాడీ భవనాలను మంగళవారం నర్సాపూర్ సీడీపీఓ హేమభార్గవి, చిలప్‌చెడ్ మండల ఇన్‌చార్జి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సంతోష పరిశీలించారు. ఈ సందర్భంగా హేమభార్గవి మాట్లాడుతూ.. మండలంలోని 16 అంగన్‌వాడీ భవనాలను పరిశీలించామని, ఒక్క పానాది తండా అంగన్‌వాడీ భవనం మినహా అన్ని బాగానే ఉన్నాయన్నారు. ప్రస్తుతం పానాదితండా అంగన్‌వాడీ భవనానికి ప్రత్యామ్నాయంగా మరో భవనం దొరకడం లేదని, త్వరలోనే ఆ కేంద్రాన్ని కూడా మరో భవనంలోకి మార్చేస్తామని తెలిపారు.
మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట ప్రభుత్వ కళాశాల ఆవరణలో క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట చిన్నశంకరంపేట కళాశాల విద్యార్థులు ఉన్నారు.
నేటినుంచి దివ్యాంగులకు
క్యాంపులు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో దివ్యాంగులకు కోసం బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డీడబ్ల్య యూ హైమావతి ప్రకటనలో తెలిపారు. అలిమ్‌కో అనే సంస్థ ద్వారా 29, 30, 31 తేదీల్లో మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లలో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందజేస్తామన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవన్‌లో జరిగే శిబిరానికి మెదక్, హవేళిఘణాపూర్, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన దివ్యాంగులు హాజరు కావాలన్నారు. 30న రామాయంపేటలోని రైతు వేదికలో నిర్వహించే శిబిరంలో రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి, మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల దివ్యాంగులు, 31న నర్సాపూర్‌లో ని రైతు వేదికలో నిర్వహించే శిబిరంలో నర్సా పూర్, మనోహరాబాద్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ మండలాల దివ్యాంగులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment