ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై విడాకులు తీసుకుంది. 24 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌కు విడాకులిచ్చింది. ఈ విషయాన్ని వాసుదేవ్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. '2020వ సంవత్సరం నుంచి మంజు, నేను విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకుల ప్రక్రియ పూర్తయింది. తను ఇప్పుడు నాకు భార్య కాదు. అయితే మా మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుంది. తనను నా స్నేహితురాలిగానే భావిస్తాను. ప్రస్తుతం మంజు కెరీర్ గొప్ప స్థాయిలో ఉంది. క్లోజ్ ఫ్రెండ్ సక్సెస్ అవుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది' అని చెప్పుకొచ్చాడు.
ఇది రెండోసారి
కాగా మంజు గతంలో నటుడు ముకుందన్ మీనన్‌ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2000వ సంవత్సరంలో మంజు.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా దయ అనే కూతురు పుట్టింది. గత కొంతకాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుండగా ఇన్నాళ్లకు అవి నిజమేనని ధ్రువీకరించాడు వాసుదేవ్.
కెరీర్ సాగిందిలా
1992లో నట ప్రస్థానం ఆరభించింది మంజు పిళ్లై. గోలంతర వార్త, నీ వరువోళం, ఆయుష్మాన్ భవ, నింజగల్ సంతుస్తరను, మిస్టర్ బట్లర్, రావణప్రభు, తేజ్ భాయ్ అండ్ ఫ్యామిలీ, లవ్ 24x7, ఓ మై డార్లింగ్, ద టీచర్, జయ జయ జయ జయహే తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. వాసుదేవ్ విషయానికి వస్తే కేరళ కేఫ్ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టాడు. అయాల్, మెమొరీస్, దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. తెలుగులో మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు పని చేశాడు.
చదవండి: OTT: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment