
తెలుగు, తమిళ చిత్రాల్లో రాణిస్తున్న నటి రాశి ఖన్నా. ముఖ్యంగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ హైదరాబాద్ బ్యూటీ తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇమైక్కా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత అడంగామరు, అయోగ్యా, సంఘ తమిళన్, సర్ధార్, తిరుచిట్రం ఫలం వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.
చదవండి: ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి, ఎమ్మెల్యే కొడుకే చేసినట్లు ఆరోపణలు!
అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకూ అందాలారబోతకే పరిమితం అయ్యారని చెప్పవచ్చు. హీరోను ప్రేమించడం, డ్యూయెట్‌లకే పరిమితం అయ్యారు. బాలీవుడ్‌లో యోధ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. దీని గురించి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ నటికి అందం ముఖ్యమే.. అయితే అందంతోనే సినిమాలో నిలదొక్కుకోవడం కష్టమన్నారు.
చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి
సుదీర్ఘకాలం ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవడానికి, ఎక్కువ అవకాశాలు పొందడానికి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యమని ఇప్పుడే గ్రహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు తనను జాలీగా ఉండే పాత్రలోనే చూడ్డానికి అభిమానులు ఇష్టపడ్డారని, తనకు అలాంటి పాత్రలే వచ్చాయని చెప్పారు. అయితే ప్రతిభను చాటుకోవాలంటే వైవిద్యభరిత కథా పాత్రలు అవసరం అన్నారు. ఇకపై అలాంటి కథా పాత్రలనే ఎంచుకుని నటించాలని నిర్ణయించుకున్నట్లు రాశీఖన్నా చెప్పారు.