రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే! | Anchor Anasuya Bharadwaj Clarity About Her Political Entry - Sakshi
Sakshi News home page

Anasuya: పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన అనసూయ!

Published Tue, Oct 10 2023 7:58 PM | Last Updated on Tue, Oct 10 2023 8:29 PM

Anchor Anasuya Into Politics Clarify Rumours - Sakshi

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. స్టార్ హీరోహీరోయిన్ల దగ్గర నుంచి చిన్న చిన్న నటుల వరకు పాలిటిక్స్‌లోకి వచ్చిన సందర్భాలు ఉ‍న్నాయి. రాజకీయ నేపథ్య కథలో ఎవరైనా నటిస్తే చాలు.. వాళ్లకు ఏమైనా ఇందులో ఆసక్తి ఉందా అనే సందేహాలు వస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే యాంకర్ అనసూయ విషయంలో జరిగింది. దీంతో హాట్ బ్యూటీ క్లారిటీ కూడా ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: కొడుకు లిప్‌లాక్ సీన్స్.. రాజీవ్ కనకాల అలాంటి కామెంట్స్!)

ఎందుకు ఈ ప్రశ్న?
యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నటిగానూ ప్రూవ్ చేసుకుంది. రంగస్థలం, పుష్ప తదితర సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె 'రజాకర్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో పాట రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ మూవీ రాజకీయ నేపథ్య కథ కావడం, నిర్మాత బీజేపీ నాయకుడు కావడంతో.. అనసూయకు కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అనే డౌట్ వచ్చింది. తాజాగా ఆమెని జర్నలిస్టులు అదే ప్రశ్న అడిగారు.

అనసూయ కామెంట్స్
'రాజకీయం అనేది నా వల్ల కాదు. చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ల(పొలిటిషియన్స్) పని వాళ్లని చేయనిద్దాం' అని చెప్పింది. అలానే నిర్మాత బీజేపీ నాయకుడు కదా.. మీ మధ్య ఎప్పుడైనా రాజకీయాల గురించి డిస్కషన్ వచ్చిందా? ఒకవేళ ఆయన ఆహ్వానిస్తే.. ఆ పార్టీలోకి వెళ్తారా? అని అడగ్గా.. 'అసలు మా మధ్య ఆ టాపిక్కే ఎప్పుడూ రాలేదు' అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement