
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ మరోసారి బిగ్‌బాస్ ఓటీటీలోనూ పాల్గొంది.
ఇక ఇటీవలి కాలంలో హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్‌గా రామ్‌గోపాలవ్ వర్మ ఇంటర్వ్యూతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన అషూరెడ్డి తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసే అవకాశాన్ని కొట్టేసింది.
యంగ్ హీరో అరవింద్ కృష్ణ నటిస్తున్న ఏ మాస్టర్ పీస్ (AMasterpiece) చిత్రంలో మెయిన్ లీడ్‌గా అవకాశం దక్కించుకుంది. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది.