బిగ్ బాస్ హౌస్‌లోని మూడవ వారం మూడు క్యాబేజీ కుమ్ములాటలు, ఆరు బెలూన్ల బంతాటలతో వాడి వేడిగా నామినేషన్స్ కొనసాగాయి. కాని ఈ వారం విచిత్రమేమిటంటే నామినేషన్స్ తో సంబంధం లేకుండా అభయ్ అనే కంటెస్టంట్ ఎలిమినేట్ అవ్వడం. అదే అలా అయిందో ఇప్పుడు చెప్పుకుందాం. బిగ్ బాస్...ఈ పేరు వినడమే కాని, ఈ కార్యక్రమం చరిత్రలో ఎవ్వరూ బిగ్ బాస్‌ని చూసి ఉండరు. కాని బిగ్ బాస్ కంఠం ప్రపంచ ప్రేక్షకులకు సుపరిచితం. కేవలం కంఠంతోనే ఓ కార్యక్రమం నడిపిస్తున్న తీరు అద్భుతమనే చెప్పాలి. అలాగే ఆ కంఠానికి కూడా భావావేశాలున్నాయన్న విషయం ఈ వారం ఎపిసోడ్‌లో తేలింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
హౌస్‌లో బిగ్ బాస్ పెట్టిన టాస్కులవల్లనో లేకపోతే అవి ఫుడ్ కోసం పెట్టిన కారణానో ఏమో కాని అభయ్ అనే కంటెస్టెంట్ విపరీతమైన చిరాకు కోపంతో సదరు బిగ్ బాస్‌నే మితిమీరిన మాటలతో దుర్భాషలాడాడు. అదే విషయం నాగార్జున వీడియోతో సహా వారాంతం కార్యక్రమంలో ప్రేక్షకులతోపాటు మిగతా కంటెస్టెంట్స్ కి చూపించాడు. ఆ వెంటనే నాగార్జున కోపంతో బిగ్ బాస్ రాజ్యంలోనే బిగ్ బాస్‌ని అంటావా అంటూ హౌస్ డోర్లు ఓపెన్ చేయించి తక్షణమే బయటకు వెళ్ళమన్నాడు. కాని అభయ్‌తో పాటు మిగతావారందరూ క్షమించి మరో అవకాశమివ్వని వేడుకొనగా నాగార్జున కొంత శాంతించి అప్పటికైతే అభయ్‌ని హౌస్‌లో ఉండనిచ్చాడు. కాని బిగ్ బాస్ మాత్రం లోపల రగిలిపోయి ఎలాగూ నామినేషన్స్ లో వున్న అభయ్‌ని ఎలిమినేట్ చేయించాడు.
దీనిని బట్టి బిగ్ బాస్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు మరియు హౌస్ లోని కంటెస్ట్ంట్స్ బిగ్ బాస్‌కి కూడా కోపమొస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నోరు అదుపులో ఉంటే ఊరు మంచిదవుతుందన్నట్టు ఆఖర్లో ఎలిమినేట్ అయిన తరువాత నాగార్జున దగ్గరకు వచ్చిన తరువాత గాని తెలియలేదు సదరు అభయ్ అనే కంటెస్టెంట్ కి. హౌస్‌లో కంటెస్టెంట్స్ అరుపులు, కేకలతో విరుచుకుపడతారు, మరి వాళ్ళని కంట్రోల్ చేసే బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ఇప్పటికైతే బిగ్ బాస్ కోపాన్ని చూశాం ముందు ముందు ఎపిసోడ్లలో బిగ్ బాస్ నవరసాల్లో ఇంకెన్ని రసాలు పలికిస్తాడో చూడాలి మరి.
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment