అవును, విడిపోయాం: బ్రేకప్‌పై బిగ్‌బాస్‌ బ్యూటీ క్లారిటీ | Bigg Boss Kannada OTT Fame Jayshree Aradhya Confirms Breakup with Steven | Sakshi
Sakshi News home page

Bigg Boss: ప్రియుడితో సహజీవనం.. బ్రేకప్‌ చెప్పిన బిగ్‌బాస్‌ బ్యూటీ

Published Sat, Nov 9 2024 5:33 PM | Last Updated on Sat, Nov 9 2024 5:47 PM

Bigg Boss Kannada OTT Fame Jayshree Aradhya Confirms Breakup with Steven

కన్నడ నటి, బిగ్‌బాస్‌ బ్యూటీ జయశ్రీ ఆరాధ్య ప్రియుడు స్టీవెన్‌తో విడిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఇదే నిజమని నటి ధృవీకరించింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

లోన్‌ తీసుకుని ప్రారంభించా..
'నేను, నా బాయ్‌ఫ్రెండ్‌ విడిపోయాం. ఇక మీదట ద గ్లామ్‌ రూమ్‌ మేకప్‌ క్లినిక్‌కు సంబంధించి ఏ వివరాలకైనా నన్ను, నా టీమ్‌ను మాత్రమే సంప్రదించండి. ఈ మేకప్‌ క్లినిక్‌ కోసం ఎవరితోనూ నేను చేయి కలపలేదు. బ్యాంకులో లోన్‌ తీసుకుని సొంతంగా మొదలుపెట్టాను. ఆ అప్పు నేనే తీర్చుకుంటాను. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ థాంక్యూ' అని రాసుకొచ్చింది.

సినిమాలు, రియాలిటీ షోలతో ఫేమస్‌
కాగా ఆరాధ్య, స్టీవెన్‌ విడిపోయి సుమారు నెలరోజులు కావస్తోందట. వీళ్లిద్దరూ చివరిసారిగా రాజా రాణి అనే రియాలిటీ షోలో కలిసి పాల్గొన్నారు. కొంతకాలం పాటు సహజీవనం కూడా చేశారు. ఇకపోతే జయశ్రీ ఆరాధ్య కన్నడలో బెంగళూరు బాయ్స్‌, పుట్టరాజు: లవర్‌ ఆఫ్‌ శశికళ, ధరణి మండల మధ్యదూళిగ వంటి పలు చిత్రాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్‌ ఓటీటీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

 

 

చదవండి: కంగనా రనౌత్‌ ఇంట విషాదం.. తనే మా ఇన్‌స్పిరేషన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement